NTR: ఛావా సినిమా ఒక్క హిందీలోనే రిలీజ్ అయినా కూడా పాన్ ఇండియా లెవల్లో అదరగొడుతోంది.ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్‌లో ఈ సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు వెళ్లిపోయాయి. అందుకే తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేయాలని ఇక్కడ ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ పై ఇప్పుడు ఓ క్రేజీ రూమర్ వైరల్‌గా మారింది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఇంకా కన్పార్ట్ కాలేదు. కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తెలుగు వెర్షన్‌కు డబ్బింగ్ అందిస్తున్నారన్న రూమర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే సినిమా యూనిట్ నుంచి ఇంకా తెలుగు డబ్బింగ్ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. స ఈ సినిమాకు ఎన్టీఆర్ డబ్బింగ్ అందిస్తున్నాడు అనే మాటలో కూడా ఇంకా క్లారిటీ లేదు. ఒక వేళ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందిస్తే ఆ ఇంఫాక్ట్ ఛావా తెలుగు వెర్షన్ మీద చాలా గట్టిగా ఉండటం పక్కా.
