Breaking: తెలుగు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ యాడ్ షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు. షూటింగ్‌లో ఒక సన్నివేశం చేస్తుండగా ఆయనకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్టీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని ఆయన టీమ్ స్పష్టంచేసింది. చిన్న గాయాలే ఉన్నాయని, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ ఘటనపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా, త్వరలోనే ఎన్టీఆర్ మళ్లీ పనుల్లో పాల్గొంటారని టీమ్ తెలిపింది.