Devara 2

Devara 2: ‘దేవర 2’ కోసం ఎన్టీఆర్ రెడీ!

Devara 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ సినిమా భారీ విజయాన్ని సాధించి, అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇప్పుడు ఆ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్‌గా ‘దేవర 2’ తెరకెక్కేందుకు సన్నాహాలు వేగంగా జరుగుతున్నాయి.

దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే స్క్రిప్ట్‌ను పూర్తిగా లాక్‌ చేసినట్లు సమాచారం. కొత్త ఎలిమెంట్స్, అద్భుతమైన యాక్షన్ సీన్స్, కొత్త పాత్రలతో ఈసారి మరింత ఎమోషనల్‌గా కథను రూపొందించారని ఇండస్ట్రీ టాక్. డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇందులో హీరోయిన్లుగా జాన్వీ కపూర‌్‌తో పాటు మరో ప్రముఖ నటి కనిపించనున్నారు. ఇక సైఫ్ అలీ ఖాన్ మరోసారి విలన్‌గా తన శక్తివంతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. సంగీతం అందిస్తున్న అనిరుధ్ మరోసారి మ్యూజికల్ మాస్ ఫీస్ట్ ఇవ్వనున్నారు.

గతేడాది సెప్టెంబర్‌ 27న విడుదలైన ‘దేవర’ సినిమా, ఎన్టీఆర్‌ మాస్ యాక్షన్ అవతారాన్ని కొత్తగా చూపిస్తూ సూపర్‌హిట్ టాక్‌ సాధించింది. ఈ చిత్రం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాణ సంస్థ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో, ప్రతి సముద్ర తీరాన్ని వణికించిన దేవరకి ఏడాది పూర్తయింది. ఆయన చూపిన భయం, ఆయన పంచిన ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక ‘దేవర 2’కి సిద్ధంగా ఉండండి అంటూ సందేశం ఇచ్చింది.

Also Read: Sai Marthand: లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ తో నితిన్ మూవీ…?

ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమా 2026 జూన్‌ 25న విడుదల కానుంది. ఆ ప్రాజెక్ట్‌ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్‌ ‘దేవర 2’లో నటించనున్నట్లు సమాచారం. కొరటాల శివ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో దేవర పార్ట్ 1లో మీరు చూసింది కేవలం 10 శాతం మాత్రమే. అసలు శక్తి ‘దేవర 2’లో కనిపిస్తుంది. ప్రతి పాత్రలో ట్విస్ట్ ఉంటుంది అంటూ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించారు. ఎన్టీఆర్ కూడా పలు సందర్భాల్లో ఫస్ట్ పార్ట్ విజయం మా మీద బాధ్యతను పెంచింది. సీక్వెల్ మరింత శక్తివంతంగా, భావోద్వేగంగా, పెద్ద స్థాయిలో ఉంటుంది అని చెప్పారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *