NTR Birthday Blast : యంగ్ టైగర్ ఎన్టీఆర్ మే 20న తన పుట్టినరోజు వేడుకలకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా అభిమానులకు డబుల్ సర్‌ప్రైజ్‌లు రెడీ అవుతున్నాయి. ‘ఎన్టీఆర్‌నీల్’ నుంచి గ్లింప్స్ విడుదలకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుండగా, ‘వార్ 2’ నుంచి ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌లు కూడా రిలీజ్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అయితే, ఈ విషయంపై చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇంకా ఇవ్వాల్సి ఉంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్‌తో ఎన్టీఆర్ నటిస్తున్న ‘వార్ 2’ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందుతోంది.
Also Read: Sara Tendulkar: స్టార్ హీరోతో సచిన్ టెండూల్కర్ కూతురు డేటింగ్..!
NTR Birthday Blast : ఈ చిత్రం ఆగస్టు 14న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఇక పుట్టినరోజు సందర్భంగా అభిమానులు తెల్లవారుజామునే తారక్ నివాసానికి చేరుకొని శుభాకాంక్షలు తెలిపేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ బర్త్‌డే అభిమానులకు మరపురాని క్షణాలను అందించనుంది!
దేవర మూవీ ఆయుధ పూజా వీడియో సాంగ్ :