AP News: మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు కేసు నమోదైన నేపథ్యంలో ఈ చర్య చేపట్టారు.ఈ విషయంపై ప్రసన్నకుమార్ రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Indian Temple: పురుషులు వెళ్లకూడని 7 ఆలయాలు.. ఇండియాలో ఎక్కడంటే?
“నాలో నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రక్తం ఉంది. మాకు భయం అంటే ఏంటో తెలియదు. అవసరమైతే ఎంత దూరమైనా వెళ్తాం” అని ఆయన స్పష్టం చేశారు.
అలాగే, తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ.. “నాకు చేతి నొప్పి కారణంగా ఆసుపత్రికి వెళ్లాను. ఎక్కడికీ పారిపోలేదు. ఇప్పుడే కావాలంటే వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లండి” అని సవాల్ విసిరారు.

