Jeevan Reddy : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నోటీసులు

ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. జీవన్‌రెడ్డి మాల్‌కి ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు మంగళవారం షాక్‌ ఇచ్చారు. మరోసారి ఫైనాన్స్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. ఆర్మూర్ ఆర్టీసీ డిపో స్థలంలో నిర్మించిన వ్యాపార సముదాయం.. బకాయిలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ కార్పొరేషన్ నోటీసులు ఇచ్చింది. రూ.45.46 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలంటూ నోటీసులో పేర్కొంది. మాల్ నిర్మాణం కోసం తీసుకున్న అప్పును తీర్చకుంటే.. తనఖా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని అధికారులు నోటీసులు ఇచ్చారు. షూరిటీ ఇచ్చిన ఆశన్నగారి రాజన్న, గంగారెడ్డి, నరేందర్, లక్ష్మణ్‌ల భూముల వద్ద సైతం నోటీసులు ఇచ్చారు అధికారులు. జీవన్ మాల్ కు గతంలో ఇంతకుముందు ఆర్టీసీకి బకాయి పడ్డ కిరాయి డబ్బులు, విద్యుత్ బిల్లులను చెల్లించాలంటూ.. నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మరో మారు సోమవారం స్టేట్ కార్పొరేషన్ ఫైనాన్స్ అధికారులు బకాయిలు చెల్లించాలంటూ.. షూరిటీ దారులకు, వారి భూములను స్వాధీనం చేసుకుంటామని నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

కాగా గతంలో జీవన్‌రెడ్డికి ఆర్టీసీ, విద్యుత్ అధికారులు షాక్ ఇచ్చారు. ఆర్మూర్‌లోని ఆర్టీసీ స్థలాన్ని అద్దెకు తీసుకుని ఆ స్థలంలో షాపింగ్ మాల్‌ని జీవన్‌రెడ్డి నిర్మించాడు. అయితే షాపింగ్ మాల్ అద్దెని గత కొంత కాలంగా కట్టకుండా ఎగ్గొడుతున్నాడు. సుమారుగా రూ.7.50 కోట్ల అద్దె బకాయిలు చెల్లించకుండా ఆర్టీసీ అధికారులను బెదిరిస్తూ వస్తున్నాడు. అలాగే తన షాపింగ్ మాల్‌కి విద్యుత్ బిల్లులు కూడా చెల్లించడం లేదు. ఇన్నిరోజులుగా అధికార బలంతో జీవన్‌రెడ్డి అద్దె బకాయిలు అడగడానికి వచ్చిన అధికారులపై చెలరేగిపోయాడు. ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, జీవన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆర్టీసీ , విద్యుత్ అధికారులు రంగంలోకి దిగి జీవన్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగి షాపింగ్ మాల్‌‌కి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. షాపింగ్ మాల్‌‌కి బకాయి ఉన్న నగదును వెంటనే చెల్లించాలని లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని ఆర్టీసీ, విద్యుత్ అధికారులు హెచ్చరించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *