NATS

NATS: చికాగో హైవే ను దత్తత తీసుకున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం.. స్వచ్ఛందంగా శుభ్రపరిచి నాట్స్

NATS: ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ (North America Telugu Society – NATS) ఆధ్వర్యంలో అందరిలో సామాజిక సేవా స్ఫూర్తిని పెంచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా చికాగో లో హైవే దత్తత తీసుకుని హైవేను శుభ్రం చేసే కార్యక్రమం నిర్వహించింది.

ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న తెలుగు విద్యార్థులను ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి.. వారికి ప్రభుత్వ వాలంటరీ అవర్స్ లభించేలా నాట్స్ (NATS) కృషి చేస్తోంది. అందులో భాగంగానే చికాగో హైవేను దత్తత తీసుకుని దానిని శుభ్రపరిచే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సేవా పథంలో 20 మందికి పైగా తెలుగు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని హైవేను శుభ్రపరిచారు.

NATS

ఇలా సర్వీస్ చేస్తే వచ్చే వాలంటరీ అవర్స్ విద్యార్థులకు కాలేజీ ప్రవేశాలకు ఉపయోగపడతాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి ఈ సందర్భంగా తెలిపారు. నాట్స్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్ధులను ప్రోత్సహించారు.

నాట్స్ చికాగో చాప్టర్ కోఆర్డినేటర్లు నరేంద్ర కడియాల, అంజయ్య వేలూరు, వీర తక్కెళ్ళపాటి తమ పక్కా ప్రణాళిక, సమర్థవంతమైన సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేశారు. చికాగో చాప్టర్ కు చెందిన పాండు చెంగలశెట్టి,ఈశ్వర్ వడ్లమనాటి, శ్రీనివాస్ ఎక్కుర్తి, దివాకర్ ప్రతాపుల, గోపాల్‌లకు నాట్స్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిసింది.

ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యులు శ్రీనివాస్ పిడికిటి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్కే బాలినేని, హరీష్ జమ్ముల , ఎమ్మాన్యుయేల్ నీలా, అలాగే మాజీ బోర్డు సభ్యులు మూర్తి కొప్పాక, శ్రీని అరిసాడ, శ్రీనివాస్ బొప్పన లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తెలుగు విద్యార్ధుల్లో సామాజిక బాధ్యత పెంచే చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన చికాగో నాట్స్ నాయకులను నాట్స్ ప్రశాంత్ పిన్నమనేని అభినందించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *