Noida Dowry Murder Case: గత వారం రోజులుగా సోషల్ మీడియాతో పాటు ఇండియా మొత్తం సంచలనం గా మరీనా గ్రేటర్ నోయిడా వరకట్న మరణం కేసు కొత్త మలుపు తిరిగింది. నిక్కీ భాటి (26) తన చివరి క్షణాల్లో చేసిన వాంగ్మూలం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
ఫోర్టిస్ ఆసుపత్రి వైద్యులు, నర్సుల వాంగ్మూలం ప్రకారం.. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగి తనకు అంటుకోవడం తో తనకి గాయాలు అయ్యాయి” అని నిక్కీ చెప్పినట్లు సమాచారం.ఇపుడు ఈ విషయం బయటికి రావడంతో, ఇప్పటి వరకు ఉన్న వరకట్న వేధింపుల ఆరోపణలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే, పోలీసులు నిక్కీ ఇంటిని పరిశీలించినపుడు సిలిండర్ పేలుడు ఆధారాలు ఎక్కడ కనపడలేదు అన్నారు. దీంతో, ఆమె నిజంగా ఈ విషయాని మనస్ఫూర్తిగా చెప్పిందా ? లేక ఎవరైనా ఒత్తిడి చేసి అలా చెప్పించారా? అన్న అనుమానాలపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
నిక్కీ మరణం, అరెస్టులు
గత వారం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలిస్తుండగా నిక్కీ మృతి చెందింది. పోస్టుమార్టం నివేదికలో ఆమెకు 80% వరకు కాలిన గాయాలు ఉన్నట్లు తేలింది.
ఈ కేసులో నిక్కీ భర్త విపిన్ భాటి, అతని తల్లిదండ్రులు, సోదరుడు రోహిత్ (నిక్కీ చెల్లి కాంచన్కి భర్త)లను పోలీసులు అరెస్టు చేశారు. అదనంగా, ఆదివారం కస్టడీ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన విపిన్‌ను పోలీసులు కాల్చగా, అతని కాలి వద్ద గాయం అయ్యింది.
ఇది కూడా చదవండి: NC24: నాగ చైతన్య సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లాపతా లేడీస్ హీరో..
చెల్లి వాంగ్మూలం
బాధితురాలి చెల్లి కాంచన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిక్కీని అత్తమామలు ఉద్దేశపూర్వకంగా నిప్పంటించారని, ఈ దారుణం అంత ఆమె ఆరేళ్ల కొడుకుముందే జరిగిందని,వివాహ సమయంలో SUV సహా అనేక బహుమతులు ఇచ్చినప్పటికీ మరిన్ని వరకట్నం డిమాండ్ చేశారని ఆరోపించింది.
అదే కాకుండా, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో నిక్కీపై అత్తమామలు దాడి చేసి, జుట్టు పట్టుకుని లాగుతున్న దృశ్యాలు బయటపడ్డాయి.
నేపథ్య విభేదాలు
దర్యాప్తు ప్రకారం, నిక్కీ – కాంచన్ ఇద్దరు సోదరీమణులు 2016లో ఒకే కుటుంబంలో పెళ్లి చేసుకున్నారు. కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ తయారు చేయడం, బ్యూటీ పార్లర్ నడపడం వంటి విషయాలు కుటుంబంలో ఉద్రిక్తతలకు దారితీసాయని అధికారులు గుర్తించారు.
ఇప్పుడు అసలు నిజం ఏంటి?
ఒక వైపు – ఫోర్టిస్ ఆసుపత్రి మెమోలో “గ్యాస్ సిలిండర్ పేలుడు వల్లే గాయాలు” అని రాసి ఉంది.
మరోవైపు – బాధితురాలి కుటుంబం మాత్రం “వరకట్న వేధింపులే కారణం” అని నిలదీస్తోంది.
ఈ రెండు విభిన్న వాదనల మధ్య అసలు నిజం వెలికితీయడానికి పోలీసులు దర్యాప్తును మరింత కఠినతరం చేశారు.
