Medicines: పారాసెటమాల్ సహా 53 మందులు నాణ్యత పరీక్షలో విఫలమైనట్లు తేలింది. విటమిన్లు, మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ) మందులతో పాటు, పలు యాంటీబయాటిక్స్ కూడా ఈ లిస్టులో ఉన్నాయి. దేశంలోని అతిపెద్ద ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) ఈ మేరకు ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. CDSCO లిస్టులో కాల్షియం, విటమిన్ D3 సప్లిమెంట్లు, యాంటీ-డయాబెటిస్ మాత్రలు, అధిక రక్తపోటు మందులు ఉన్నాయి.
నిషేధిత ఔషధాల జాబితాలో మూర్ఛలు, ఆందోళనలో ఉపయోగించే క్లోనాజెపామ్ మాత్రలు, పెయిన్ కిల్లర్ డిక్లోఫెనాక్, శ్వాసకోశ వ్యాధులకు ఉపయోగించే ఆంబ్రోక్సాల్, యాంటీ ఫంగల్ ఫ్లూకోనజోల్, కొన్ని మల్టీ విటమిన్ అలాగే కాల్షియం మాత్రలు కూడా ఉన్నాయి.
Medicines: ఈ మందులను హెటెరో డ్రగ్స్, ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్), కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ వంటి పెద్ద కంపెనీలు తయారు చేస్తున్నాయి.
సిడిఎస్‌సిఓ 48 ఔషధాల లిస్టును విడుదల చేసింది. దీనిప్రకారం హిందుస్తాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన కడుపు ఇన్‌ఫెక్షన్‌కు ఇచ్చే మెట్రానిడాజోల్ కూడా ఈ పరీక్షలో విఫలమైంది. అదేవిధంగా, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ షెల్కాల్ టాబ్లెట్లు కూడా పరీక్షలో విఫలమయ్యాయి.
నాణ్యత లేనివిగా చెబుతున్న మొత్తం 48 మెడిసిన్స్ పూర్తి లిస్ట్ చూడటం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Medicines: CDSCO 53 ఔషధాల నాణ్యత పరీక్షను నిర్వహించింది. కానీ 48 మందుల జాబితాను మాత్రమే విడుదల చేసింది. ఎందుకంటే 53 ఔషధాల తయారీ కంపెనీల్లో 5 ఇవి తమ మందులు కాదని, తమ పేరుతో నకిలీ మందులను మార్కెట్‌లో విక్రయిస్తున్నాయని చెప్పారు. ఆ తర్వాత వాటిని లిస్టు నుంచి తొలగించారు.
Medicines: ఈ ఏడాది ఆగస్టులో 156 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) మందులను నిషేధించింది. జ్వరం, జలుబు కాకుండా, ఇవి సాధారణంగా పెయిన్ కిల్లర్స్, మల్టీ విటమిన్లు, యాంటీబయాటిక్స్‌గా ఉపయోగిస్తున్న మందులు. వీటిని వాడడం వల్ల మనుషులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. అందువల్ల, దేశవ్యాప్తంగా ఈ మందుల ఉత్పత్తి, వినియోగం, పంపిణీపై నిషేధం విధించింది.
Medicines: డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు సిఫారసుల మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఎఫ్‌డిసి మందులలో ఉండే పదార్థాలకు ఎటువంటి వైద్యపరమైన సమర్థన లేదని బోర్డు తన నివేదికలో పేర్కొంది. ఒకే మాత్రలో ఒకటి కంటే ఎక్కువ మందులను కలపడం ద్వారా తయారు చేసిన మందులను ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ డ్రగ్స్ (FDC) అంటారు, ఈ మందులను కాక్‌టెయిల్ డ్రగ్స్ అని కూడా అంటారు.
ఇది కూడా చదవండి : తిరుపతి లడ్డూ నెయ్యి ఎఫెక్ట్.. కర్ణాటకలో దేవాలయాల్లో నందిని నెయ్యి మాత్రమే వాడాలని ఆర్డర్స్!