Revanth Redddy

CM Revanth : ఇంకుడు గుంతలు నిర్మించని ఇళ్లకు నో పర్మిషన్ : సీఎం రేవంత్

ఇంకుడు గుంతలు నిర్మించని ఇళ్లకు పర్మిషన్ ఇవ్వబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఒకప్పుడు 200 ఫీట్ల లోపే బోర్ పడేదని.. ఇప్పుడు 1,200 ఫీట్లు వేసినా లాభం ఉండట్లేదన్నారు. ఇంకుడు గుంతలు కట్టని ఇళ్లకు అనుమతులు ఇవ్వొద్దని అధికారులకు ఆదేశాలిచ్చారు. అలాంటి ఇళ్లకు నీళ్ల ట్యాంకర్ ద్వారా నీళ్లిస్తే రెండింతలు అదనంగా వసూలు చేయాలని చెప్పానన్నారు. నగరాన్ని బాగు చేసేందుకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామని సీఎం తెలిపారు.

ఇక బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో రూ.1500కోట్లు ఉన్నాయని, అందులో రూ.500 కోట్లు మూసీ నిర్వాసితులకు ఇవ్వాలని సీఎం రేవంత్ అన్నారు. హైడ్రా విషయంలో ప్రతిపక్షం ఎందుకు సూచనలు ఇవ్వలేదని ప్రశ్నించారు. అక్రమంగా నిర్మించిన కేటీఆర్, హరీశ్ రావు, సబిత ఫామ్ హౌస్‌లను కూల్చాలా? వద్దా? అనే విషయంలో వాళ్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు 15వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పారు.

మూసీని అడ్డు పెట్టుకుని బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తున్నాయని సీఎం రేవంత్ విమర్శించారు. ‘కిషన్ రెడ్డి, ఈటల.. మీకు మోదీ చేపట్టిన సబర్మతి రివర్ ఫ్రంట్ కావాలి కానీ.. మూసీ రివర్ ఫ్రంట్ వద్దా? కిరాయి మనుషులతో కేటీఆర్, హరీశ్ రావు హడావుడి చేస్తున్నారు. ఫాంహౌస్‌లు కూల్చుతామనే భయంతో పేదలను అడ్డుపెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు. మూసీ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కంటే ప్రత్యామ్నాయం ఏముంటుంది?’ అని ప్రశ్నించారు.

మరోవైపు అర్హులకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్‌ అన్నారు. కొత్తగా రేషన్ కార్డులు రాకపోవడంతో పథకాలు అందలేదని, వారందరికీ రేషన్ కార్డు అందించాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రేషన్ కార్డు విధానం ఎత్తివేశారనే ప్రచారంలో నిజం లేదని సీఎం స్పష్టం చేశారు. అన్ని సంక్షేమ పథకాలను ఈ డిజిటల్ కార్డుతో అనుసంధానం చేస్తామన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jeevan Reddy : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నోటీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *