SSMB29

SSMB29: Globetrotter ఈవెంట్ కు పోలీసుల కండిషన్స్.. స్పెషల్‌ వీడియోతో రాజమౌళి క్లారిటీ..!

SSMB29: టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. అదే… సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం ‘SSMB29’ (గ్లోబ్‌ట్రాటర్). ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్‌డేట్ కోసం సినీ ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే స్టార్ నటులు పృథ్విరాజ్ సుకుమారన్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనస్ ల ఫస్ట్ లుక్స్ విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా, ప్రియాంక చోప్రా ‘మందాకిని’ లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. పసుపు చీరలో గన్ పట్టుకుని ఆమె కనిపించిన తీరు కేవలం కొద్ది నిమిషాల్లోనే ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.

రాజమౌళి హెచ్చరిక: ‘నో పాస్.. నో ఎంట్రీ’

ఈ చిత్రానికి సంబంధించిన మొదటి ఈవెంట్ “గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్” నవంబర్ 15న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి ఒక ప్రత్యేక వీడియో విడుదల చేసి అభిమానులకు కొన్ని ముఖ్య సూచనలు చేశారు.

“ఈ ఈవెంట్‌కు కేవలం పాస్‌లు ఉన్న వారినే అనుమతిస్తాం. సోషల్ మీడియాలో ‘ఎవరైనా వెళ్లొచ్చు’ అని వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దు. అభిమానులు దయచేసి క్రమశిక్షణగావ్యవహరించాలి అన్నారు.పోలీసులు 18 ఇయర్స్ కంటే తక్కువ ఉన్నవారిని ఇంకా చిన్న పిల్లలు ఈ ఈవెంట్ కి రావడానికి పోలీసులు నిరాకరించారు. అందుకు గతంలో జరిగిన సంఘటనలే కారణం అన్నొచు అని తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని జియో హాట్‌స్టార్‌లో లైవ్‌గా వీక్షించవచ్చు అని రాజమౌళి స్పష్టం చేశారు.

అనవసర గందరగోళాన్ని నివారించేందుకు, కేవలం ఆహ్వానితులను ఇంకా పాస్ ఉన్నవారిని మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతించనున్నట్లు ఆయన సందేశం ద్వారా తేలిపోయింది.

ఈ ఈవెంట్ ని హోస్ట్ చేయడానికి సుమతో పాటు మహారాష్ట్రకు చెందిన ఫేమస్ యూట్యూబర్ ఆశిష్ చంచ్లానీ (Ashish Chanchlani) కూడా హోస్ట్ చేయనున్నటు తెలుస్తుంది.

మహేష్ లుక్ ఎప్పుడు? అభిమానుల్లో ఉత్కంఠ

ఇప్పుడు అందరి దృష్టి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ లుక్ పైనే ఉంది. ఆయన లుక్ ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో తారాస్థాయికి చేరుకుంది. దీనిపై రెండు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి:

కొంతమంది సినీ వర్గాలు మహేష్ బాబు ఫస్ట్ లుక్ నవంబర్ 14నే విడుదల కావచ్చని చెబుతున్నారు. మరికొందరు, రాజమౌళి సినిమాలకు ఉండే ప్రత్యేకమైన ప్రెజెంటేషన్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ లుక్‌ను నవంబర్ 15న జరగబోయే ప్రత్యేక ‘గ్లోబ్‌ట్రాటర్’ ఈవెంట్‌లోనే ఘనంగా ఆవిష్కరించనున్నారని అంటున్నారు.

రాజమౌళి గత చిత్రాల ప్రమోషన్లు చూస్తే, ఫస్ట్ లుక్‌ను ప్రత్యేకంగా అభిమానుల మధ్య ఆవిష్కరించే అవకాశం ఎక్కువగా ఉంది. ‘మహేష్ గ్లోబల్ అవతార్ ఎలా ఉంటుంది?’ అనే ప్రశ్న సోషల్ మీడియాలో హాష్‌ట్యాగ్‌లతో హీట్ పుట్టిస్తోంది.

‘గ్లోబ్‌ట్రాటర్’ కేవలం మహేష్ బాబు కెరీర్‌లోనే కాదు, భారతీయ సినీ చరిత్రలో కూడా ఒక పెద్ద మైలురాయి అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో షూటింగ్ జరగబోయే ఈ యాక్షన్-అడ్వెంచర్-డ్రామా చిత్రం కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *