Scrub Typhus

Scrub Typhus: ఏపీలో 1500కు పైగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు! ఆందోళన అవసరం లేదంటున్న ఆరోగ్య శాఖ.

Scrub Typhus: ఆంధ్రప్రదేశ్‌లో శీతాకాలం మొదలవగానే స్క్రబ్ టైఫస్ (Scrub Typhus) కేసులు పెరుగుతుండడం ప్రజల్లో కొద్దిపాటి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1566 స్క్రబ్ టైఫస్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. అయితే, ఈ పరిస్థితిపై ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ప్రభుత్వ అంచనా: సీజనల్ వ్యాధి, వెంటనే ప్రాణాంతకం కాదు.

ఆరోగ్యశాఖ అధికారుల ప్రకారం, స్క్రబ్ టైఫస్ అనేది ప్రతి సంవత్సరం శీతాకాలంలో కనిపించే బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి. ఇది వెంటనే ప్రాణాంతకం కాదని, ప్రజలు అనవసరంగా భయపడాల్సిన పని లేదని పేర్కొన్నారు.

ఈ వ్యాధి, మరణాలపై అంతర్జాతీయ నిపుణులతో చర్చలు జరిపినట్లు అధికారులు తెలిపారు. కేవలం ఈ బ్యాక్టీరియా వల్లే మరణాలు సంభవిస్తున్నాయనడానికి ఎలాంటి నిర్దిష్ట ఆధారాలు (Proofs) లేవని, మరణాలకు అనేక ఇతర కారణాలు ఉండవచ్చని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Telangana Global Summit: తొలి రోజునే రూ. 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు.

ఈ వ్యాధిని కలిగించే బ్యాక్టీరియా సాధారణంగా పేడ పురుగు (Mite) ద్వారా సంక్రమిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, పొలాల్లో పనిచేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

గుంటూరు జీజీహెచ్‌పై ప్రత్యేక దృష్టి..

స్క్రబ్ టైఫస్ లక్షణాలతో గుంటూరు జీజీహెచ్ (Guntur GGH) లో నలుగురు మృతి చెందినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ ధృవీకరించారు. అయితే, ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగులు మెరుగవుతున్నారని, చాలా మంది కోలుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

ఆరోగ్యశాఖ సూచనలు.. ఏం చేయాలి?

స్క్రబ్ టైఫస్ వ్యాప్తిని అరికట్టేందుకు, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేసింది:

ఎవరికైనా జ్వరం, ఇతర లక్షణాలు కనిపించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా దగ్గరలోని వైద్యుడి వద్దకు వెళ్లాలి.

డాక్టర్లు సూచించిన యాంటీ బయాటిక్ మందులను క్రమం తప్పకుండా వాడాలి. సకాలంలో సరైన చికిత్స అందిస్తే ఈ వ్యాధిని సులభంగా నయం చేయవచ్చు.

నివసించే ప్రాంతాలను, ముఖ్యంగా వ్యవసాయ ప్రాంతాలలో జాగ్రత్తగా ఉండాలి. పేడ పురుగుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రభుత్వం ఈ కేసుల పెరుగుదలపై నిశితంగా దృష్టి సారిస్తోంది. ప్రజలు ఆందోళన పడకుండా, అప్రమత్తంగా ఉంటూ, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *