Toll charges: ప్రైవేట్ కారు యజమానులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై టోల్ చార్జీలు తగ్గించేలా కొత్త ప్రణాళికను అమలు చేయనుంది. జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే వారి కోసం ప్రత్యేక “టోల్ పాస్” అందుబాటులోకి రానుంది.
ఈ పాస్‌ను ₹3,000 చెల్లించి పొందితే – ఏడాది పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టోల్ ప్లాజాలపై అపరిమితంగా ప్రయాణించవచ్చు. ఇక ₹30,000 చెల్లిస్తే, 15 ఏళ్ల పాటు టోల్ చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రయాణించే అవకాశం లభిస్తుంది.
ప్రస్తుత పరిస్థితితో పోల్చితే ఈ పాస్ ఎంత లాభదాయకం?
ప్రస్తుతం, ఒకే టోల్ ప్లాజా కోసం నెలవారీ పాస్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని కోసం ప్రయాణికులు నెలకు ₹340 చెల్లించాలి. అంటే ఏడాదికి ₹4,080 ఖర్చు అవుతుంది. కానీ కొత్త టోల్ పాస్ ద్వారా కేవలం ₹3,000తో ఏటా ఎక్కడైనా అపరిమిత ప్రయాణం చేయవచ్చు. దీని వల్ల అర్థికంగా చాలా మేలు జరుగుతుందని ప్రయాణికులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Dollar Dreams: అప్పులు.. ఆస్తుల అమ్మకాలతో డాంకి రూటులో అమెరికాకి.. చివరికి అవమానకరంగా ఇంటికి..
ఇప్పటికే ఈ ప్రతిపాదన కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వద్ద పరిశీలనలో ఉంది. ఇంకా జాతీయ రహదారులపై ప్రైవేటు కార్ల యజమానుల నుంచి టోల్ రుసుము తగ్గించే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా టోల్ గేట్లను పునర్వ్యవస్థీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోజూ టోల్ చెల్లించాల్సిన ఇబ్బందిని తగ్గించేందుకు ఈ కొత్త టోల్ పాస్ వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరం కానుంది.