High Court On Theatres: ‘పుష్ప-2’ మూవీ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన దుర్ఘటన రకరకాల మలుపులు తిరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అనుచిత నిర్ణయం కారణంగా హైకోర్టు బోలెడన్ని ఆంక్షలు పెట్టడం మొదలైంది. ఇక మీదట బెనిఫిట్ షోస్, స్పెషల్ షోస్, టిక్కెట్ రేట్ల పెంపుపై నిషేధం విధించిన హైకోర్టు తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లలోకి రాత్రి 11 గంటల తర్వాత, ఉదయం 11 గంటల ముందు వేసే షోస్ కు 16 సంవత్సరాల లోపు పిల్లలను అనుమతించకూడదని పేర్కొంది. ఈ విషయమై రాష్ట్ర హోమ్ శాఖ సంబంధిత అధికారులతో, నిర్మాతలతో, ట్రేడ్ బాడీస్ తో చర్చించి ఓ నిర్ణయానికి రావాలని… అప్పటి వరకూ తమ ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది.

