Anna canteen: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్ల లో కొత్త సమస్యలు తలెత్తాయి. రూ.5కే భోజనం అందిస్తున్న కారణంగా కొంతమంది తాగుబోతులు కూడా ఇక్కడ వస్తూ, ఇతర కస్టమర్లతో మరియు సిబ్బందితో గొడవలు మొదలు పెడుతున్నారు.ఈ పరిస్థితిని గమనించిన ఒంగోలులోని అన్న క్యాంటీన్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. “మద్యం తాగిన వారికి నో ఎంట్రీ” అని బోర్డులు ఏర్పాటు చేశారు.
“రూ.5కే భోజనం” అందించడం వల్ల అనేక నిరుపేదలు క్యాంటీన్లపై ఆధారపడుతున్నారు. అయితే, కొంతమంది తాగుబోతులు కూడా అక్కడకు వచ్చి, సిబ్బంది, ఇతర కస్టమర్లతో గొడవలకు దిగుతున్నారు. వాళ్లు ఫూటుగా మద్యం తాగి, అంగీకారం లేకుండా భోజనం కోసం కూరలు వేయాలని డిమాండ్ చేస్తూ గొడవలు చేస్తుండటంతో, నిర్వాహకులు ఈ సమస్యను పరిష్కరించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఇది తెలిసిన తర్వాత, మద్యం తాగి వచ్చిన వారికి టోకెన్ ఇవ్వదలచలేదు. అలాగే, “మద్యం తాగడానికి సరిపడా డబ్బులు ఉన్నవారు హోటల్స్‌కు వెళ్లి తినండి” అని పిలుపు ఇచ్చారు. “రూ.5కే భోజనం మాత్రమే నిరుపేదలకు అందించబడుతుంది” అని నిర్వాహకులు స్పష్టం చేశారు.