Tirumala: ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ కె.వి.ఎన్. ప్రొడక్షన్స్ నిర్మాత ఎన్.కె.లోహిత్ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఉదయం విఐపి దర్శన విరామ సమయంలో ఆయన స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రాలతో ఆయనకు ఆశీర్వచనాలు అందించారు. ఆ తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఆయనకు పట్టు వస్త్రాలతో సత్కారం చేయగా, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుమలలో పవిత్రమైన వాతావరణంలో శ్రీవారి దర్సన భాగ్యం లభించడాన్ని ఎన్.కె. లోహిత్ ధన్యతగా భావించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు కూడా ఆయనతో పాటు ఉన్నారు.
