Nizamabad:నిజామాబాద్ జిల్లాలో ఇటీవల రౌడీషీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్ ఘటన సంచలనంగా మారింది. పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసినందుకు అతనిపై పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారని పోలీసు శాఖ నివేదికలో పేర్కొన్నారు. అనంతరం మీడియా కథనాల ఆధారంగా తెలంగాణ మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. నవంబర్ 24లోగా ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీకి మానవ హక్కుల కమిషన్ ఆదేశాలు జారీచేసింది.
Nizamabad:ఇదిలా ఉండగా, తమను పోలీసులు వేధిస్తున్నారంటూ ఎన్‌కౌంటర్ మృతుడు రియాజ్ కుటుంబ సభ్యులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు పలు ఆధారాలతో వారు కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్‌కౌంటర్ ఘటన తర్వాత తమను స్వగ్రామంలోకి వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని, తమ కుటుంబ సభ్యులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Nizamabad:రియాజ్ చేతిలో హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్‌కు, రియాజ్‌కు మధ్య డబ్బుల విషయంలో గతంలో గొడవలు జరిగాయంటూ కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. ఓ కేసు విషయంలో రియాజ్ వద్ద కానిస్టేబుల్ ప్రమోద్ రూ.3 లక్షలు డిమాండ్ చేసి, రూ.30 వేల వరకూ తీసుకున్నాడని ఆరోపించారు. మిగతా సొమ్ము కోసం రియాజ్‌ను కానిస్టేబుల్ ప్రమోద్ తీవ్రంగా వేధించాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

