Nizamabad: నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన బయటపడడంతో అధికారులు కఠినంగా స్పందించారు. ఈ ఘటనలో నిందితులైన ఐదుగురు విద్యార్థులను తక్షణమే సస్పెండ్ చేస్తూ కళాశాల ప్రిన్సిపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
అంతేకాక, ఈ విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌ను ఆరు నెలల పాటు రద్దు చేశారు. ర్యాగింగ్‌లో పాల్గొన్న వారిని హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగించేందుకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.
పోలీస్ శాఖ నివేదిక అందిన తరువాత మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని కళాశాల అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థుల భద్రత, క్యాంపస్ శాంతి కోసం ఇలాంటి చర్యలు తప్పనిసరని పేర్కొన్నారు.