Nizamabad:

Nizamabad: ఏటీఎం చోరీకి విఫ‌ల‌య‌త్నం.. తెరుచుకోలేద‌ని త‌గుల‌బెట్టిన దుండ‌గులు

Nizamabad: నిజామాబాద్ జిల్లాలో దొంగ‌లు రెచ్చిపోయారు. రెండుచోట్ల చోరీకి విఫ‌ల‌య‌త్నం చేశారు. ప‌నికాలేద‌ని ఏకంగా ఏటీఎం మిష‌న్ల‌ను త‌గుల‌బెట్టారు. గంట‌ల‌పాటు ప్ర‌య‌త్నించినా ప‌నికాలేద‌ని ఈ నిర్వాకానికి ఒడిగ‌ట్టారు. దీంతో ఆ ఏటీఎంలో ఉన్న రూ.37 ల‌క్ష‌ల‌ న‌గ‌దంతా కాలిబూడిదైంది. ఇంత జ‌రుగుతున్నా ఈ విష‌యం ఆ బ్యాంకు అధికారుల‌కు కానీ, గ‌స్తీ పోలీసులు కానీ గుర్తించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Nizamabad: తొలుత నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సాయిన‌గ‌ర్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంపై దాడికి పాల్ప‌డ్డారు. గ్యాస్ క‌ట్ట‌ర్‌తో మెషీన్‌ను తెరువాల‌ని ప్ర‌య‌త్నించారు. ఈ స‌మ‌యంలో సుమారు రూ.10 ల‌క్ష‌ల న‌గ‌దు కాలిబూడిదైంది. అనంత‌రం ఆర్య‌న‌గ‌ర్‌లోని డీసీబీ బ్యాంకు ఏటీఎంలో కూడా ఇదే త‌ర‌హా చోరీకి విఫ‌ల‌య‌త్నం చేశారు. ఈ స‌మ‌యంలో మిష‌న్ ద‌గ్ధం కావ‌డంతో రూ.27 ల‌క్ష‌ల న‌గ‌దు ద‌గ్ధ‌మైంది. రెండు చోట్ల క‌లిపి రూ.37 ల‌క్ష‌ల న‌గ‌దు కాలిబూడిదైంది.

Nizamabad: దొంగ‌లు అంత‌కు ముందు కార్లు, బైక్‌ల‌పై ఏటీఎం ప్రాంతాల్లో రెక్కీ నిర్వ‌హించిన‌ట్టు సీసీ టీవీ వీడియోల్లో రికార్డ‌యింది. ఈ చోరీల‌పై ఆయా బ్యాంకుల అధికారుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసులు న‌మోదు చేసుకొని దుండ‌గుల కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ చోరీ ఘ‌ట‌న‌ల‌తో న‌గ‌రంలో ఆందోళ‌న నెల‌కొన్న‌ది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *