Shardul vs Nitish: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు తొలిసారి ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోంది. యంగ్ ఇండియాకు ఇంగ్లాండ్ పెద్ద సవాలుగా మారంది. చివరిసారిగా భారత్ 2007లో ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ గెలిచింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి టెస్ట్ సిరీస్ గెలవలేదు. ఈసారి కూడా రోహిత్, విరాట్, అశ్విన్ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకపోవడంతో జట్టుకు విజయం అంత సులభం కాదు. కానీ అది అసాధ్యం కాదు. శుభ్‌మాన్ గిల్ తొలిసారి భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అదే సమయంలో నితీష్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్ మధ్య జట్టులో చోటు కోసం పోటీ ప్రారంభమైంది. ప్రస్తుత ప్లేయింగ్ 11 లో రెడ్డికి బదులుగా శార్దూల్ ఠాకూర్ కు అవకాశం ఇవ్వడానికి 3 కారణాల ఉన్నట్లు తెలుస్తోంది.
బౌలింగ్ లో బెస్ట్ :
ఇంగ్లాండ్‌లో స్పిన్నర్ల కంటే ఫాస్ట్ బౌలర్లు చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో శార్దూల్ ఠాకూర్ నాల్గవ పేసర్‌గా ఆడవచ్చు. నితీష్ రెడ్డి కంటే శార్దూల్ ఎక్కువ బౌలింగ్ చేయగలడు. నితీష్ ఫిట్‌నెస్ కారణంగా తక్కువగా బౌలింగ్ చేయవచ్చు. అటువంటి పరిస్థితిలో, శార్దూల్‌కు తుది జట్టులో చోటు లభించవచ్చు.
నితీష్ కంటే అనుభవజ్ఞుడు:
నితీష్ కుమార్ రెడ్డి కంటే శార్దూల్ ఠాకూర్ కు ఎక్కువ అనుభవం ఉంది. అతడికి గతంలో ఇంగ్లాండ్‌పై ఆడిన అనుభవం ఉంది. ఇప్పటివరకు శార్దుల్ ఇంగ్లాండ్‌లో 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 10 వికెట్లు పడగొట్టగా.. నితీష్ ఆస్ట్రేలియాతో సిరీస్ లో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నితిశ్ తొలిసారి ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్నారు. ఠాకూర్ ఇప్పటివరకు తన కెరీర్‌లో మొత్తం 11 టెస్టులు ఆడాడు.
బ్యాటింగ్ సైతం:
శార్దూల్ ఠాకూర్ మంచి బ్యాట్స్‌మన్ కూడా. అవసరమైనప్పుడు అతను బ్యాట్‌తో జట్టుకు అండగా నిలవగలడు. అయితే నితీష్ శార్దూల్ కంటే మెరుగైన బ్యాట్స్‌మన్. కానీ అవసరమైనప్పుడు ఠాకూర్ జట్టుకు ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడగలడు. అంతేకాకుండా అతడు నితీశ్ కంటే మంచి బౌలర్. ఠాకూర్ ఇంగ్లాండ్‌లో 3 టెస్ట్ హాఫ్ సెంచరీలు సాధించడం గమనించదగ్గ విషయం.
Also Read: Virat Kohli: మళ్లీ గ్రౌండ్ లో కోహ్లి కనిపించేది ఎప్పుడంటే?
భారత క్రికెట్ జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకుంది. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని జట్టు మైదానంలో చెమటోడ్చుతోంది. ఈ సిరీస్ జూన్ 20న ప్రారంభమవుతుంది. గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ అయినప్పటి నుండి భారత టెస్ట్ రికార్డు బాగా లేదు. అతని కోచింగ్ కెరీర్‌లో, జట్టు న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో ఓడిపోయింది. దీని తరువాత, జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. దీని కారణంగా టీమ్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ టెస్ట్ కూడా గంభీర్ కు చాలా ముఖ్యమైనది.