Nithya Menen

Nithya Menen: అవార్డ్ గ్రహీతలతో ఉత్తమనటి నిత్య!

Nithya Menen: ‘తిరు’ చిత్రానికి గానూ జాతీయ ఉత్తమనటిగా ఎంపికైంది నిత్యామీనన్. ప్రస్తుతం ఆమె మరో జాతీయ ఉత్తమ నటుడు ధనుష్ డైరెక్షన్ లో ‘ఇడ్లీ కడై’ అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. విశేషం ఏమంటే… ఐదేళ్ళ క్రితం జాతీయ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకున్న విజయ్ సేతుపతి సినిమాలోనూ నిత్యా చోటు దక్కించుకుంది. పాండియరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన నిత్యా తొలిసారి నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సైతం తిరుచందూర్ లో పూజా కార్యక్రమాలతో బుధవారం మొదలైంది. అలానే నిత్యా నటించిన ‘కాదల్కి నేరమిల్లై’ మూవీ విడుదల కావాల్సి ఉంది. దీనితో పాటే నిత్యా ‘గోల్డెన్ వీసా’ అనే సినిమాకూ సైన్ చేసింది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తం మీద నిత్యామీనన్ కెరీర్ ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలతో బాగానే సాగిపోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *