Nithiin: తమ్ముడు మూవీ ఇచ్చిన షాక్ తో హీరో నితిన్ నెక్స్ట్ ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారట. వాస్తవానికి ఈ ప్రాజెక్టులో నటించేందుకు నానీ నో చెప్పడంతో నితిన్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక బలగం మంచి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకు డు వేణు ఎల్లమ్మ మూవీతో వస్తోన్న విషయం తెలిసిందే. గత ఏడాదిగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ ఈ ఏడాది చివరలో పట్టాలెక్కనున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టులోనూ మొదటగా నానీనే అనుకున్నప్పటికీ వేరే ప్రాజెక్టులో బిజీ కారణంగా ఒప్పుకోలేదని నిర్మాత దిల్రాజు ప్రకటించారు. దీంతో ఆయన ప్లేస్ లో నితిన్ ను తీసుకుంటున్నట్లు తెలిపారు. తమ్ముడు మూవీకి ఖర్చు బాగా వస్తుందని హీరో రెమ్యు నరేషన్ ను కూడా తగ్గించారు.
Also Read: Andhra King Taluka: ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పై క్రేజీ న్యూస్!
తాజాగా ఎల్లమ్మ మూవీకి కూడా దాదాపు అంతే బడ్జెట్ అయ్యేలా ఉందట. దీంతో ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారట నిర్మాత దిల్రాజు సరిగ్గా అదే ఆలోచన హీరో నితిన్ కూడా చేస్తున్నారట. ఎలాగు తమ్ముడు సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి ఈ మూవీ కోసం రెమ్యునరేషన్ తీసు కోవద్దనే ఆలోచనకు వచ్చాడట. ఒకవేళ సినిమా సక్సెస్ అయితే దిల్ రాజు ఇచ్చినంత తీసుకోవ చ్చని అనుకుంటున్నాడట. నితిన్ కు ప్రస్తుతం సక్సెస్ ముఖ్యం కాబట్టి ఆ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

