Nithiin Ishq Re Release: 12 వరుస ప్లాప్స్ తర్వాత నితిన్ కెరీర్ కు ఊపిరి పోసిన సినిమా ‘ఇష్క్’. సూపర్ హిట్ ‘జయం’తో కెరీర్ ని ఘనంగా ఆరంభించిన నితిన్ ఆ వెంటనే ‘దిల్’తో మరో సక్సెస్ చవిచూశాడు. అయితే ఆ తర్వాత రాజమౌళి ‘సై’ మినహా మరే సినిమా అంతగా ఆడలేదు. దాదాపు అన్ని సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఇక సినిమాల్లో కష్టం అనుకున్న టైమ్ లో సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ పై విక్రమ్ గౌడ్ నిర్మాతగా నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మాణ సారథ్యంలో విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఇష్క్’. నిత్యామీనన్ హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా నితిన్ ని సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టింది.
ఇది కూడా చదవండి: Oscar 2025: ఆస్కార్ 2025కి అర్హత పొందిన ఇండియన్ షార్ట్ ఫిల్మ్!
అప్పటి నుంచి ఇప్పటి వరకూ నితిన్ కెరీర్ తిరుగులేకుండా కొనసాగుతూ ఉంది. ఇటీవల మళ్ళీ నితిన్ వరుస పరాజయాలను ఫేస్ చేస్తున్నాడు. 11 సంవత్సరాల తర్వాత గతేడాది నితిన్ పుట్టినరోజున ‘ఇష్క్’ రీరిలీజ్ చేసినా అంతగా ఆడలేదు. ఇప్పుడు మరోసారి ఈ నెల 30 ‘ఇష్క్’ను రీరిలీజ్ చేయనున్నారు. డిసెంబర్ 20న విడుదల కాబోతున్న ‘రాబిన్ హుడ్’ కి కర్టెన్ రైజర్ లా వస్తున్న ‘ఇష్క్’ మరోసారి నితిన్ కెరీర్ కి ఆక్సిజన్ అందిస్తుందేమో చూడాలి.