Nita Ambani: రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ (Nita Ambani)కి అమెరికాలో విశేషమైన గౌరవం లభించింది. మసాచుసెట్స్ రాష్ట్ర ప్రభుత్వం ఆమెను గ్లోబల్ ఛేంజ్‌మేకర్‌గా గుర్తిస్తూ గవర్నర్ ప్రశంసాపత్రాన్ని అందజేసింది. బోస్టన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలీ ఈ అవార్డును ప్రదానం చేశారు.
ఇది కూడా చదవండి: Bollywood Icons: హాలీవుడ్ కి పోతున్న సల్మాన్, సంజయ్ దత్!
నీతా అంబానీ దాతృత్వ సేవలు, విద్య, ఆరోగ్యం, క్రీడలు, కళలు, సంస్కృతుల అభివృద్ధికి చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఈ గౌరవం దక్కింది. లక్షలాది మంది జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావడంలో ఆమె పాత్ర కీలకమని మసాచుసెట్స్ ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఆమె చేతితో నేసిన బనారసీ చీరను ధరించి హాజరయ్యారు.