Nishikant Dubey: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో గురువారం 8వ రోజు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రతిపక్షాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయని నిషికాంత్ దూబే ఆరోపించారు. ఖలిస్తాన్ మద్దతుదారులను, కాశ్మీర్ విభజన కోరుకునే వారిని మీరు కలవలేదా?’ అని రాహుల్ గాంధీని నిషికాంత్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం సాధించిన అభివృద్ధిని తప్పుగా నిరూపించాలని ప్రతిపక్ష నాయకులు ఒక వర్గం కోరుకుంటున్నారని నిషికాంత్ అన్నారు.
ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌కు చెందిన సలీల్ చౌదరితో సంబంధాలపై ప్రతిపక్ష నేతను నేను 10 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అని నిషికాంత్ అన్నారు. సలీల్ చౌదరి భారత్ జోడో యాత్రకు డబ్బు ఇవ్వలేదా? అంటూ ఆయన ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Bangladesh: త్రిపుర, కోల్‌కతా బాంగ్లాదేశ్ దౌత్యవేత్తలు రీకాల్
రాహుల్ అమెరికా వెళ్లి అక్కడ ముష్ఫికుల్ ఫజల్ ను కలిశారని నిషికాంత్ తెలిపారు. బంగ్లాదేశ్‌లో జరిగిన హత్యలకు ఫజల్ బాధ్యుడని చెప్పారు. రాహుల్ ఇల్హాన్ ఒమర్, రో ఖన్నా, బార్బరా లీలను కలిశారు. అమెరికాలో మోడీ కార్యక్రమాలను ఇంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఖలిస్తాన్‌ను సృష్టించాలని, కాశ్మీర్‌ను విభజించాలని కోరుతున్న వారిని రాహుల్ కలిశారని తీవ్ర ఆరోపణలు చేశారు నిషికాంత్
బీజేపీ అబద్ధాలు చెబుతోందని అస్సాం ఎంపీ గౌరవ్ గొగోయ్ అన్నారు. పార్లమెంటును నడపాలని ప్రభుతం కోరుకోవడం లేదు. రాహుల్ గాంధీ దేశంలో శాంతిని నెలకొల్పాలన్నారు. మణిపూర్‌లో ఏ విధంగా నిప్పు పెట్టారో అదే విధంగా సంభాల్‌ను కూడా కాల్చాలని ప్రధాని మోదీ భావిస్తున్నారాణి ఆరోపించారు.