Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ మార్క్ బడ్జెట్.. మారిపోయిన ప్రసంగ శైలి.. ‘Part B’ ఇక అత్యంత కీలకం!

Nirmala Sitharaman: కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెడుతున్న తరుణంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. గత 75 ఏళ్లుగా వస్తున్న ఒక బలమైన సంప్రదాయానికి స్వస్తి పలికి, బడ్జెట్ రూపకల్పనలో కొత్త మార్పులు తీసుకురావడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మారిపోయిన బడ్జెట్ శైలి: సాధారణంగా దశాబ్దాలుగా బడ్జెట్ ప్రసంగం రెండు భాగాలుగా (Part A మరియు Part B) ఉంటుంది. సాధారణంగా ‘Part A’లో ప్రభుత్వ పథకాలు, కేటాయింపులు ఉంటే, ‘Part B’లో పన్నులకు సంబంధించిన మార్పులు ఉండేవి. కానీ ఈసారి నిర్మలమ్మ తన 9వ బడ్జెట్ ప్రసంగంలో ‘Part B’ని మరింత శక్తివంతంగా మార్చారు. పన్నులతో పాటు దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే కీలకమైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను కూడా ఈ భాగంలోనే చేర్చడం ఒక చారిత్రాత్మక మలుపు.

సంప్రదాయాలకు స్వస్తి – సంస్కరణలకు నాంది: గతంలో బ్రిటీష్ కాలం నాటి లెదర్ బ్రీఫ్‌కేస్ వాడే పద్ధతిని తీసేసి, ఎర్రటి వస్త్రంలో చుట్టిన ‘బహీ ఖాతా’ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ, ఇప్పుడు ప్రసంగ శైలిని కూడా మార్చి తనదైన ముద్ర వేశారు. దేశ ఆర్థిక ముసాయిదా మొత్తం ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Tirumala: శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. నిన్నటి హుండీ ఆదాయం ఎంతంటే?

కీలక రంగాలకు పెద్దపీట: ఈ ఏడాది ప్రభుత్వం సుమారు రూ. 11 లక్షల 20 వేల కోట్ల మూలధన వ్యయాన్ని (Capex) అంచనా వేస్తోంది. ముఖ్యంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ క్రింది రంగాలకు భారీ నిధులు కేటాయించనున్నారు.

  • టెక్నాలజీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టెక్ రంగాల్లో కొత్త ఆవిష్కరణలు.
  • మౌలిక సదుపాయాలు: రైల్వే, డిఫెన్స్ (రక్షణ), ఆటోమొబైల్ రంగాలు.
  • పర్యావరణం: పునరుత్పాదక ఇంధనం (Renewable Energy) కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు.
  • ప్రజా సంక్షేమం: ఆరోగ్యం, విద్య, వ్యవసాయం మరియు పర్యాటక రంగాలకు ప్రాధాన్యత.

దేశ ఆర్థిక వృద్ధి రేటును పెంచడం మరియు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపొందింది. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభిస్తుందా? సామాన్యుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయా? అన్న ఉత్కంఠకు ఈ సరికొత్త బడ్జెట్ ప్రసంగం తెరదించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *