Nirmala Sitharaman: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఆమె కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వరుసగా రేపు (ఫిబ్రవరి 1న) ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌తో కలిపి తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుండటంతో ఈ అరుదైన ఘనతతో మహిళా సాధికారతను చాటిచెప్పారు. ఇది పార్లమెటరీ చరిత్రలోనే ఒక చారిత్రక ఘట్టంగా ప్రశంసలు అందుతున్నాయి.
Nirmala Sitharaman: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిననాటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ వస్తున్న నిర్మలా సీతారామన్ అనేక రికార్డులను నెలకొల్పారు. అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూ వచ్చిన ఆమె దేశంలో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొచ్చారు. కరోనా మహమ్మారి సమయంలో ఏర్పడిన సంక్షోభం నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం వరకు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూలత పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆమె విశేష కృషి చేశారు.
Nirmala Sitharaman: ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామణ తొమ్మిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆమెను ప్రశంసించారు. దేశంలో మహిళా సాధికారతకు నిలువెత్తు సాక్ష్యంగా ఆమె నిలిచారని కొనియాడారు. ఇది దేశ పార్లమెంటరీ చరిత్రలోనే అరుదైన ఘట్టమని పేర్కొన్నారు. మహిళా లోకానికి గొప్ప స్ఫూర్తిని నింపారని పేర్కొన్నారు.
