Nirmal district:నిర్మల్ జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొందరు అధికార పార్టీ నాయకుల వేధింపులు తాళలేక ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన తన భార్యను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టేందుకు సిద్ధం కాగా, పోటీ చేయవద్దంటూ కొందరు నాయకులు బలవంత పెట్టారని, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు.
Nirmal district:నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సోమారిపేట గ్రామానికి చెందిన బండారి రవీందర్ (54) ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పంచాయతీ ఎన్నికల్లో ఆయన తన భార్య పుష్పను సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబెట్టాడు. అయితే ఈ విషయంపై అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు అభ్యంతరం వ్యక్తంచేశారు.
Nirmal district:పోటీ నుంచి తప్పుకోవాలని, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ రవీందర్‌ను అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేశారు. తాము చెప్పినట్టుగా వినకుంటే తీవ్ర పరిణామాలు ఎందుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు వారి వేధింపులు తట్టుకోలేక తన ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు, మృతుడి బంధుమిత్రులు కోరుతున్నారు.

