Nirmal District: పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. తొలి, మలి విడత ఎన్నికల్లో ఎన్నో విశేషాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకటి, రెండు కీలకమైన ఓట్లతో ఎందరో గెలిచి నిలుస్తున్నారు. ఆ ఒకటి రెండు ఓట్లు కూడా ఎన్నో విశేషాలతో పడటంతో మరింత రంజుగా మారుతున్నాయి. ఇక్కడ కూడా ఇదే విచిత్రం చోటుచేసుకున్నది.
Nirmal District: నిర్మల్ జ ఇల్లా లోకేశ్వరం మండలం బాగాపూర్ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి ముత్యాల శ్రీ వేద పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మలి విడత ఫలితాల్లో 426 ఓట్లకు గాను 378 ఓట్లు పోలయ్యాయి. ఆ ఓట్లలో శ్రీవేదకు 189 ఓట్లు రాగా, హర్ష స్వాతికి 188 ఓట్లు వచ్చాయి. వాటిలో ఒకటి చెల్లని ఓటు వచ్చింది. దీంతో ఒక్క ఓటు తేడాతో శ్రీ వేద విజయం సాధించారు.
Nirmal District: అయితే శ్రీవేద మామ ముత్యల ఇంద్రకరణ్‌రెడ్డి అమెరికాకు వెళ్లారు. తన కోడలు శ్రీ వేద ఎన్నికల్లో నిల్చిందని తెలిసి పోలింగ్‌కు నాలుగు రోజులకు ముందు స్వగ్రామానికి వచ్చారు. ఫలితాల్లో ఆయన కోడలు శ్రీవేద ఒక్క ఓటుతో గెలువడంపై ఇది ఇంద్రకరణ్‌రెడ్డి వల్లే సాధ్యమైందని, ఆయన రాకుండా ఉండి ఉంటే ఫలితం తారుమారయ్యేదని గ్రామస్థులు ముచ్చటించుకోవడం గమనార్హం.
