Niranjan Reddy: ఎమ్మెల్సీ కవిత నిన్న చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పందించారు. నిరంజన్‌రెడ్డి అవినీతి పరుడని, ఆయన వల్ల ఎందరో బీఆర్ఎస్ కార్యకర్తలు ఇబ్బందులు పడ్డారని, ఆయన నిర్లక్ష్యం వల్లే వనపర్తి అభివృద్ధి చెందలేదని, ఆయనకు మూడు నాలుగు ఫాంహౌజ్‌లు ఉన్నాయని కవిత పలు ఆరోపణలు చేశారు. ఓ దశలో పుచ్చలేచిపోద్ది.. అంటూ ఆమె తీవ్ర విమర్శలు చేయడం వివాదానికి దారితీసింది. వీటిపై ఈ రోజు (నవంబర్ 25) ఆయన ప్రెస్‌మీట్‌లో పలు విషయాలపై మాట్లాడారు. కవిత ఆరోపణలపై ప్రత్యారోపణలను గుప్పించారు.
Niranjan Reddy: తాను నీళ్ల నిరంజన్‌రెడ్డి అనమని పిలిపించుకోలేదని, నీళ్లిచ్చిన తనను జనమే అలా పిలుచుకున్నారని నిరంజన్‌రెడ్డి చెప్పారు. అవినీతికి పాల్పడిన నువ్వే లిక్కర్ రాణి.. అని పిలిపించుకున్నావని ఘాటుగా ఆరోపించారు. నువ్వు ఎత్తకపోతే బోనమే లేనట్టు.. నువ్వు ఆడకపోతే బతుకమ్మే లేనట్టు దురహంకారంతో ప్రవర్తిస్తున్నావని ధ్వజమెత్తారు.
Niranjan Reddy: ఓట్ల కోసం తాము తండాల్లో తిరుగుతుంటే మీ కేసీఆర్ బిడ్డ సారా దందా చేస్తే ఏం కాదు.. కానీ మేము సారా కాస్తే అరెస్టు చేసి జైల్లో పెడతారా.. అని నీ తప్పుడు పనుల వల్ల మమ్మల్ని నిలదీశారు.. అని గుర్తుచేశారు. కేసీఆర్ కూతురుగానే నీకు ఆ గౌరవం ఇచ్చామని, ఆ గౌరవాన్ని ఇప్పటికైనా నువు కాపాడుకోవడమే లేదని విమర్శించారు. మేము కేసీఆర్‌కు మంచి పేరు తెస్తుంటే.. నువ్వేమో ఆయనను మానసికంగా వేధిస్తున్నావని మండిపడ్డారు.
Niranjan Reddy: ఎవరిని సంతోషపెట్టడానికి తనపై ఆరోపణలు చేస్తున్నావు కవిత.. అంటూ నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. నీ అహంకారం, నీ చేతల వల్ల కూడా కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణాలయ్యాయని విమర్శించారు. తనకు ఒక్క వ్యవసయ క్షేత్రమే ఉన్నదని, నీకు గండిపేటలో విలావంతమైన ఫామ్‌హౌస్ లేదా? అని ప్రశ్నించారు. ఆ ఫామ్ హౌస్ కొనేందుకు నీకు అన్ని పైసలు ఎక్కడివి అని నిలదీశారు.
Niranjan Reddy: తండ్రి వయసు ఉన్న ఎమ్మెల్యేలను ఇంటికి పిలిపించుకొని జాగృతిలో చేరాలని అడిగి, ఒప్పుకోని నాలాంటి వారిపై అనవసర ఆరోపణలు ఎలా చేస్తావు? అంటూ కవితపై నిరంజన్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహించుకోవాలని హితవు పలికారు. లేదంటే కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు.

