Nimmala ramanaidu: పోలవరం ప్రాజెక్టు పనులను 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
మీడియాతో మాట్లాడిన ఆయన, డయాఫ్రం వాల్ మొత్తం పొడవు 1,396 మీటర్లలో 500 మీటర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం 3 ట్రెంచ్ కట్టర్లు, 3 గ్రాబర్ల సాయంతో డయాఫ్రం వాల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
వరదకాలంలో కూడా పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఎక్కడా నీటి కొరత ఉండదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

