Niharika

Niharika: రాఖీ రోజు గుడ్ న్యూస్ గుర్తు చేసుకున్న నిహారిక

Niharika: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భావోద్వేగభరితమైన పండుగ వాతావరణం నెలకొంది. అన్నాచెల్లెళ్ల అనురాగం, అక్కాతమ్ముళ్ల ఆప్యాయత కలగలసిన రాఖీని సెలబ్రెటీస్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిహారిక కొణిదెల.. అన్నయ్యలు వరుణ్ తేజ్, రామ్ చరణ్ లకు రాఖీ కట్టి, ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Also Read: Mahavatar Narasimha: మరో రికార్డ్ క్రియేట్ చేసిన మహావతార్ – నరసింహ

చరణ్-వరుణ్ ఇద్దరూ వన్ స్టాప్ సొల్యూషన్స్ అని, ఆ అన్నలిద్దరికీ చెల్లిగా అనిపించుకోవడం గ్రేట్ గా ఉంటుందని తన మనసులో మాట చెప్పింది నిహారిక. ఇక ఈ రక్షా బంధన్ రోజునే నిహారిక మరో గుడ్ న్యూస్ ను గుర్తు చేసుకుంది.
గతేడాది ఆగస్ట్ 9న, అందరూ కొత్త వాళ్లతో నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు రిలీజ్ అయింది. కమర్షియల్ గా సక్సెస్ అవడమే కాకుండా.. తెలంగాణ ప్రభుత్వంచే.. ఉత్తమ జాతీయ సమైక్యత, మత సామరస్యం, సామాజిక అభ్యున్నతి చిత్రంగా ఎంపికైంది. డెబ్యూ డైరెక్టర్ గా యదు వంశీ గద్దర్ అవార్డ్ అందుకున్నాడు..

 

View this post on Instagram

 

A post shared by Niharika Konidela (@niharikakonidela)

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *