Niharika NM: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్, వెర్సటైల్ నటుడు విజయ్ సేతుపతితో కలిసి ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల అధికారికంగా ప్రకటించిన ఈ సినిమాపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ టబు కీలక పాత్రలో కనిపించనుండగా, తాజాగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, నటి నిహారిక ఎన్ఎం కూడా ఈ ప్రాజెక్ట్‌లో చేరినట్లు సమాచారం.
నిహారిక ఎన్ఎం ఇటీవల ‘పెరుసు’ చిత్రంలో సున్నితమైన నటనతో ప్రేక్షకుల మనసు గెలిచింది. అడల్ట్ కంటెంట్ కథను సున్నితంగా చూపించిన ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు పూరి సినిమాలో ఆమె ఎలాంటి పాత్రలో కనిపిస్తుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. ఈ కాంబో నుంచి ఓ సంచలనాత్మక చిత్రం రాబోతుందని అభిమానులు ఆశిస్తున్నారు.