Niharika

Niharika: రెండో పెళ్లికి నిహారిక రెడీ!

Niharika: మెగా కుటుంబం నుండి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక కొణిదెల. తన కెరీర్ ప్రారంభంలోనే అనేక షార్ట్ ఫిల్మ్‌లు చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అదే క్రేజ్‌తో హీరోయిన్‌గా వెండితెరపైకి వచ్చిన మెగా డాటర్, అద్భుతమైన కంటెంట్‌తో, తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఢీ షో హోస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నిహారిక, ఆ తర్వాత ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహారెడ్డి వంటి చిత్రాల్లో నటించింది. కొన్ని టీవీ షోలు, వెబ్ సిరీస్‌లలో కూడా కనిపించింది.

డిసెంబర్ 2020లో, ఆమె సీనియర్ ఐపీఎస్ అధికారి జొన్నలాడ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్య జొన్నలాడను వివాహం చేసుకుంది. రెండేళ్లలోనే వారు విడాకులు తీసుకున్నారు. దీని వెనుక గల కారణాలు వెల్లడి కాలేదు. అప్పటి నుంచి నిహారిక మళ్ళీ తన కెరీర్ పై దృష్టి పెట్టింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి నిర్మాతగా మారింది. గత సంవత్సరం కమిటీ కుర్రోళ్లు చిత్రాన్ని నిర్మించి విజయం సాధించింది. 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 25 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం వాట్ ది ఫిష్ చిత్రం నిర్మాణంలో ఉంది.

ఇదిలా ఉండగా, నిహారిక విడాకుల తర్వాత రెండో పెళ్లి చేసుకుంటోందని, ఒక వ్యక్తితో ప్రేమలో ఉందని వార్తలు వైరల్ అయ్యాయి. నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూస్తుంటే ఏదో శుభకార్యం జరిగినట్లు అనిపిస్తుంది. ఇది చూస్తుంటే నిహారిక నిశ్చితార్థం చేసుకుందని వార్తలు ప్రారంభమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *