Nidhi Agarwal: హరిహర వీరమల్లు థియేటర్లలో నుండి వెళ్లిపోయింది కానీ నిధి అగర్వాల్ మాత్రం ఏపీలో సందడి చేస్తూనే ఉంది. ఈమధ్య ఓ మాల్ ఓపెనింగ్ కి కాకినాడ వెళ్లిన నిధికి ప్రభాస్ ఇంటి నుండి అద్భుతమైన భోజనం క్యారీర్ వచ్చింది. ప్రభాస్ ఇంటి ఫుడ్ గురించి కొత్తగా చెప్పాలా?.. ఐటెమ్స్ బాహుబలి రేంజ్ లో భారీగా ఉంటాయ్ మరి..
Also Read: Teja Sajja: మిరాయ్ టైటిల్ రహస్యం ఏంటో చెప్పేసిన తేజ!
ప్రభాస్ ఇంటి భోజనం గురించి ఇప్పటికే టాలీవుడ్ టు బాలీవుడ్ ఎంతోమంది సెలబ్రిటీలు చాలా గొప్పగా చెప్పారు.
నిధి స్టే చేస్తున్న చోటకి ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి గారు భోజనం పంపించారు. పాప వెజిటేరియన్ కాబట్టి సాలిడ్ వెజ్ ఐటమ్స్ తో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఏమేం స్పెషల్స్ పంపారో, వాటి పేర్లన్నీ ముద్దు ముద్దుగా చెప్తూ.. శ్యామలా దేవి, ప్రభాస్ లకు థ్యాంక్స్ తెలిపింది నిధి పాప.. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. ప్రస్తుతం ప్రభాస్-మారుతి కాంబోలో వస్తున్న ది రాజాసాబ్ లో యాక్ట్ చేస్తోంది నిధి అగర్వాల్..
Thank you sooo much Shyamala Garu for this wonderful meal.. very very sweet of you ❤️🤗😍 thank you Prabhas sir and Vamsi garu 🤍 pic.twitter.com/BnR7k4Khj0
— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) August 12, 2025