Nidhhi Agerwal

Nidhhi Agerwal: అభిమానుల అత్యుత్సాహంతో ఇబ్బందిపడ్డ నిధి అగర్వాల్

Nidhhi Agerwal:  హైదరాబాద్‌లోని ఓ మాల్‌ వేదికగా జరిగిన సినిమా వేడుకలో చేదు అనుభవం ఎదురవ్వడంతో నటి నిధి అగర్వాల్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ది రాజాసాబ్’ చిత్రంలోని ‘సహానా సహానా’ అనే రెండో పాటను విడుదల చేసేందుకు చిత్ర బృందం బుధవారం సాయంత్రం ఒక బహిరంగ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకకు నిధి అగర్వాల్‌తో పాటు దర్శకుడు మారుతి, సంగీత దర్శకుడు తమన్, నటి రిద్ధి కుమార్ హాజరయ్యారు.

Also Read: Sahana Sahana: ‘ది రాజాసాబ్‌’ మెలొడీ.. ఫుల్‌ సాంగ్‌ వచ్చేసింది

కార్యక్రమం ముగిసిన తర్వాత నిధి అగర్వాల్ తిరిగి తన కారు వద్దకు వెళ్లే క్రమంలో వందలాది మంది అభిమానులు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. సెల్ఫీల కోసం ఎగబడటమే కాకుండా, కొందరు వ్యక్తులు ఆమెను అసభ్యకరంగా తాకేందుకు ప్రయత్నించారు. బాడీగార్డులు ఎంతగా ప్రయత్నించినా గుంపును నియంత్రించడం కష్టతరంగా మారింది. తోపులాట మధ్యలో నిధి అగర్వాల్ తీవ్ర అసౌకర్యానికి గురై, అతి కష్టమ్మీద కారులోకి చేరుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానుల ప్రవర్తనపై నెటిజన్లతో పాటు సినీ ప్రముఖులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *