Mirai: ‘హనుమాన్’తో పాన్ ఇండియా హిట్ కొట్టిన తేజ సజ్జ ప్రస్తుతం ‘మిరాయి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. రితికా నాయక్ హీరో్యిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మంచు మనోజ్ నెగెటీవ్ రోల్ పోషిస్తుండటం విశేషం. పీరియాడిక్ అడ్వంచర్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీలో నిధి అగర్వాల్ ప్రత్యేక పాటలో నర్తించనుందట. నిధి పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు, ప్రభాస్ ‘ది రాజాసాబ్’లో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ‘మిరాయి’ షూటింగ్ శ్రీలంకలో జరుగుతోంది. గౌరహరి సంగీతాన్ని అందిస్తున్న ‘మిరాయి’ సినిమాను ఏప్రిల్ 18, 2025లో రిలీజ్ చేయనున్నారు. నిధి అగర్వాల్ సాంగ్ చేయటం సినిమాకు ప్లస్ అవుతుందంటున్నారు యూనిట్ సభ్యులు. మరి ‘హనుమాన్’ తర్వాత ‘మిరాయి’తో వస్తున్న తేజ సజ్జ ఈ మూవీతోనూ హిట్ అందుకుంటాడేమో చూడాలి.
ఇది కూడా చదవండి: SRT Entertainments: ఒకే నెలలో ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్ మెంట్స్ మూడు చిత్రాలు