నిధి సో బిజీ.. రెండు రాష్ట్రాల్లో 2 సినిమాల షూటింగ్‌లు

తాను ఒక్కరోజులోనే రెండు రాష్ట్రాల్లో 2 సినిమాల షూటింగ్‌లో పాల్గొన్నట్లు హీరోయిన్ నిధి అగర్వాల్ తెలిపారు. ‘ఆర్టిస్టుల జీవితం ఎప్పుడూ సర్‌ప్రైజ్‌లతో నిండి ఉంటుంది. కొన్ని ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా ఉంటాయి. అవి మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు పాన్‌ ఇండియా సినిమాలు.. ‘హరిహరవీరమల్లు’, ‘రాజా సాబ్‌’లలో నేను నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఒకేరోజు ఈ రెండింటి చిత్రీకరణలో పాల్గొనడం మరింత సంతోషాన్నిచ్చింది. అది కూడా ఒక సినిమా షూటింగ్‌ ఆంధ్రాలో, మరొకటి తెలంగాణలో. మా వర్క్‌ని మీ ముందుకుతీసుకురావడం కోసం వేచి చూస్తున్నా. ఈ సినిమాలు కచ్చితంగా పండగ వాతావరణాన్ని నింపుతాయి’ అని రాసుకొచ్చారు.

ఈ పోస్ట్‌పై దర్శకుడు మారుతి స్పందించారు. ‘అంకితభావంతో పనిచేస్తున్నారు. ఆల్‌ ది బెస్ట్‌’ అని రిప్లై ఇచ్చారు. జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న హరి హర వీరమల్లు చిత్రీకరణ విజయవాడలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు రాజాసాబ్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో కొనసాగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొంటూ బిజీగా ఉంది నిధి అగర్వాల్‌. హరి హర వీర మల్లు”లో ఆమె ఒక పీరియాడికల్ లుక్‌లో ఉంటే, ది రాజా సాబ్ లో ఒక స్టైలిష్ గ్లామరస్ గర్ల్ కనిపించనుంది. ఈ రెండు పాత్రల కోసం నిధికి లుక్, బాడీ లాంగ్వేజ్ లో మార్పులు వేగంగా తీసుకు రావాల్సి ఉంటుంది. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నిధి అగర్వాల్ తన పనితీరుతో అందరి మన్ననలు పొందింది. రెండు పాత్రల కోసం ప్రొఫెషనల్‌గా, శ్రద్ధగా పనిచేయడం ఆమె ప్రత్యేకత.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *