Predictions For 2025

Predictions For 2025: ఈ ఏడాది అంతా బీభత్సమే! నమ్మాల్సిందే.. కరోనా వస్తుందని ముందే చెప్పిన వ్యక్తి చెబుతున్నాడు కాబట్టి!

Predictions For 2025: కొత్త సంవత్సర వేడుకలు ఇప్పుడిప్పుడే చివరి దశకు వస్తున్నాయి. కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పిన ప్రపంచ ప్రజలు ఇప్పుడు దైనందిన జీవితంలోకి మళ్ళీ మెల్లగా అడుగు పెడుతున్నారు. అందరిలోనూ ఈ ఏడాది చాలా బావుండాలని ఆశ ఉంటుంది. అలాగే, ఈ ఏడాది ఎలా ఉంటుందనే ఉత్సుకత కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో 2025 ఎలా ఉండబోతోంది అనే విషయంలో భయంకరమైన అంచనాలు వెలువడ్డాయి. అంచనాలే కదా.. ఎవరో ఒకరు ఎదో ఒకటి చెబుతూనే ఉంటారు అని తీసిపారేయలేని పరిస్థితి ఉందిప్పుడు. ఎందుకంటే.. 2018 లో కరోనా లాంటి ఒక మహమ్మారి వస్తుందని.. అది లక్షలాదిమంది జీవితాలను అల్లకల్లోలం చేసేస్తుందని చెప్పిన వ్యక్తి ఇప్పుడు 2025 గురించి బీభత్సమైన అంచనాలు వేశాడు. అప్పుడు కరోనా గురించి చెబితే నమ్మని వ్యక్తులకు కరోనా వచ్చింది.. దీంతో విషయం నమ్మాల్సి వచ్చింది.  లండన్‌కు చెందిన హిప్నోథెరపిస్ట్ నికోలస్ ఔజులా(Nicolas Aujula Predictions 2025) ఈ అంచనాలు వేశాడు. అంతేకాదు అంతకు ముందు కూడా అతను వేసిన అంచనాలు చాలా నిజమయ్యాయి. నికోలస్ గురించి.. అతను చెప్పిన విషయాల్లో నిజమైన వాటి గురించి తెలుసుకునే ముందు ఇప్పుడు 2025 ఎంత భయంకరంగా ఉండబోతోందని అతను చెప్పాడో తెలుసుకుందాం. 

మిర్రర్ లో ప్రచురించిన కథనం ప్రకారం నికోలస్ 2025 సంవత్సరానికి సంబంధించి వేసిన అంచనాల ముఖ్యమైన పాయింట్స్ ఇవే.. 

  • 2025లో మూడో ప్రపంచ యుద్ధం జరగడం ఖాయం 
  • ఇది దయలేని సంవత్సరం 
  • మతం, జాతీయవాదం పేరుతో ఒకరి గొంతు ఒకరు కోసుకుంటారు 
  • రాజకీయ హత్యలు ఎక్కువగా జరుగుతాయి 
  • పాపం.. హింస విపరీతంగా పెరిగిపోతాయి. ఇవి ప్రపంచాన్ని వినాశనం దిశగా తీసుకువెళతాయి. 
  • ల్యాబ్ లలో అవయవాల సృష్టి జరుగుతుంది. 
  • అధిక వర్షం.. వినాశనకరమైన వరదలు ప్రపంచాన్ని వణికిస్తాయి. 
  • వీటివలన లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులవుతారు. కోట్లాదిమంది ప్రభావితమవుతారు. 
  • సముద్ర మట్టాలు వేగంగా పెరిగిపోతాయి.. దీనితో అనేక నగరాలు ప్రభావితం అవుతాయి.  
  • బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ రాజకీయ పతనాన్ని ఎదుర్కొంటారు. 
  • ప్రపంచ వస్తువుల ధరలు వేగంగా పెరుగుతాయి. 
  •  అంతే కాదు బ్రిటన్ యువరాజు విలియం, హ్యారీల మధ్య మళ్లీ కలిసి పోతారు. 

ఇది కూడా చదవండి: Today Horoscope: ఈ రాశుల వారికి అనుకున్నవి అన్నీ జరిగే అవకాశం.. ఈరోజు రాశి ఫలాలు ఇలా..

Predictions For 2025: అదండీ విషయం. భయపెట్టాలని కాదుకానీ, ఇవన్నీ తెలిసిన తరువాత వీటిలో కొన్నైనా నిజమయ్యే అవకాశం ఉందని కచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే, ఇప్పటికీ ఆ పరిస్థితికి ట్రైలర్స్ లాంటి పరిస్థితులను మనం 2024లో చూశాం. అయినా, మనం ఆశాజీవులం కనుక ఇలాంటివి జరగకూడదని. జరగవని ఆశిద్దాం. 

ఇక నికోలస్ చెప్పిన ఈ విషయాలు ఎందుకు నమ్మాలి అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం. 

  • అమెరికాకి సంబంధించిన అతిపెద్ద కదలికలలో ఒకటైన బ్లాక్ లైవ్స్ మేటర్
  • డొనాల్డ్ ట్రంప్ విజయం
  • కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) పెరుగుదల
  • కోవిడ్ లాంటి మహమ్మారి లక్షలాది మందిని ప్రభావితం చేస్తుందని ముందే చెప్పాడు 
  • రోబోట్ ఆర్మీని సరిగ్గా అంచనా వేశాడు. 

ఇంతకీ ఎవరీ నికోలస్.. (Nicolas Aujula Predictions 2025)

ప్రపంచంలోలండన్‌కు చెందిన హిప్నోథెరపిస్ట్ నికోలస్ ఔజులా. ఇతని వయసు 38 ఏళ్ళు.  తనకు 17ఏళ్ల వయసులో ఎవరో కల్లో కనిపించి భవిష్యత్ గురించి చెప్పారని చెప్పాడు. ఇప్పుడు అతను చెబుతున్న అంచనాలన్నీ ఆ కల్లో చెప్పిన అసమాహాల ఆధారంగానే ఉన్నాయని చెబుతుంటాడు. ఇతను కొన్ని రోజులు కోమాలో ఉండిపోయాడు. తరువాత ఈ విషయాలు చెప్పడం ప్రారంభించాడు. నికోలస్ చెప్పినవన్నీ ఇప్పటివరకూ నిజమయ్యాయి. అలాగే తానూ ఈజిప్తులో రాణిగా గత జన్మలో ఉన్నానని చెప్పే నికోలస్ తన గత జన్మల గురించి చాలా చెప్పుకువచ్చాడు. తన గత జన్మల్లో చైనాలో టైలర్ గా, హిమాలయాల్లో సన్యాసిగా ఉన్నానని అంతేకాకుండా ఒక జన్మలో ఆఫ్రికాలో మంత్రగత్తెగా జీవించానని నికోలస్ వెల్లడించాడు. అలాగే సింహంలా కూడా తనకు ఒక జన్మ ఉందని చెప్పుకొచ్చాడు. నికోలస్ చెబుతున్నాడని ప్రకారం “మనిషికి మరణం అంతం కాదు. ఆత్మ ఎప్పటికీ చనిపోదు”

Predictions For 2025

 

  • Beta

Beta feature

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *