NIA: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఎంత అప్రమత్తంగా.. సమర్ధవంతంగా ఉందో ఆ సంస్థ విజయవంతమైన రేటును బట్టి అంచనా వేయవచ్చు. 2024లో ఏజెన్సీ విజయం 100 శాతంగా ఉంది. అనేక హై ప్రొఫైల్ కేసుల విజయవంతమైన దర్యాప్తు – లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం ని పరిష్కరించడంలో NIA 2024లో రికార్డు స్థాయిలో 100 శాతం విజయాల రేటును సాధించింది. 2024లో ఎన్‌ఐఏ నమోదు చేసిన 80 కేసుల్లో మొత్తం 210 మంది నిందితులను అరెస్టు చేశారు.
ఈ కేసుల్లో లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం – నార్త్ ఈస్ట్ ఎక్స్‌ట్రీమిజం వరుసగా 28 – 18 కేసులతో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇది కాకుండా, 7 జమ్మూ & కాశ్మీర్ జిహాదీ కేసుల తరువాత, 6 పేలుడు పదార్థాలు, 5 మానవ అక్రమ రవాణా కేసులు ఉన్నాయి. NIA 4 ఇతర జిహాదీ కేసులు, 4 ఖలిస్థాన్, 2 ISIS, గ్యాంగ్‌స్టర్, సైబర్ టెర్రరిజం, FICN, ఇతర కేటగిరీలలో ఒక్కొక్క కేసును నమోదు చేసింది.
2024లో NIA పనితీరు చూస్తే, 25 కేసుల్లో 68 మంది నిందితులను దోషులుగా నిర్ధారించడం, 408 మంది నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేయడం ద్వారా నూరు శాతం విజయవంతమైన రికార్డు సాధించింది. ఉగ్రవాద, గ్యాంగ్‌స్టర్, ఇతర క్రిమినల్ నెట్‌వర్క్‌లను నిర్వీర్యం చేయడానికి ఏజెన్సీ నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఈ ఏడాది రూ.19.57 కోట్ల విలువైన మొత్తం 137 ఆస్తులను అటాచ్ చేశారు. వామపక్ష తీవ్రవాదం ఏడాది పొడవునా NIA పరిశీలనలో ఉంది. 2024లో నమోదైన మొత్తం 210 అరెస్టులలో గరిష్టంగా 69 మంది తీవ్రవాదుల అరెస్టులకు దారితీసింది. వామపక్ష తీవ్రవాదానికి సంబంధించి 28 కేసులు నమోదు కాగా, 64 మంది నిందితులపై 12 చార్జిషీట్లు దాఖలు చేశారు.

