Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రకమైన సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ‘ఆర్‌టీవో చలాన్’ పేరుతో నకిలీ వాట్సాప్ మెసేజ్‌లు పంపుతూ వాహనదారులను లక్ష్యంగా చేసుకుని మోసగాళ్లు దాడి చేస్తున్నారు. ఈ మెసేజ్‌లో పంపుతున్న ఏపీకే ఫైల్‌ను డౌన్‌లోడ్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యి, బ్యాంక్ ఖాతాల్లోని డబ్బులు కూడా మాయమయ్యే ప్రమాదం ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతంలో ఈ మోసం ఎక్కువగా కనిపిస్తోంది.
మోసగాళ్ల పద్ధతి
“మీ వాహనంపై ఈ-చలాన్ నమోదైంది. వెంటనే చెక్ చేయండి, లేకపోతే కోర్టులో ఎఫ్ఐఆర్” అంటూ భయపెడతారు
‘RTO Challan.apk’ అనే ఫైల్ పంపుతారు
దాన్ని ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ఫోన్‌లో permissions అడుగుతుంది
అనుమతులు ఇచ్చిన వెంటనే:
ఫోన్ డేటా మొత్తం యాక్సెస్ అవుతుంది
ఆటోమేటిక్‌గా ‘Volunteers Group’ అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అవుతుంది
మీ కాంటాక్ట్స్‌కి కూడా అదే వైరస్ ఫైల్ పంపబడుతుంది
ఫోన్‌లో ఏమవుతుంది?
వాట్సాప్ పనిచేయకపోవడం / హ్యాంగ్ అవ్వడం
ఫోన్ వేగం తగ్గిపోవడం
బ్యాటరీ చాలా త్వరగా ఖాళీ అవ్వడం
ముఖ్యంగా బ్యాంక్ OTPలు, పాస్‌వర్డులు, కాంటాక్ట్ డిటైల్స్ హ్యాకర్ల చేతిలో పడే ప్రమాద
ఇలాంటి మెసేజ్ వస్తే వెంటనే డిలీట్ చేయండి
ఫైల్ ఇప్పటికే ఓపెన్ చేసి ఉంటే:
వెంటనే ఫోన్ సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లాలి
మాల్వేర్ తొలగించాలి
OS / software రీ-ఇన్‌స్టాల్ చేయాల్సి రావచ్చు
డేటా లాస్ అవ్వొచ్చు, కాబట్టి బ్యాకప్ తప్పనిసరి


