Kane Williamson: న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం, ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడైన కేన్ విలియమ్సన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్స్ మరియు పెరుగుతున్న ఫ్రాంచైజీ లీగ్స్ నేపథ్యంలో, ఆయన టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. టెస్టులు, వన్డేలు వంటి ప్రధాన ఫార్మాట్లలో సుదీర్ఘ కాలం ఆడటానికి వీలుగా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండాలని విలియమ్సన్ నిర్ణయించుకున్నారు. వరుస అంతర్జాతీయ షెడ్యూల్స్, లీగ్‌ల ఒత్తిడి కారణంగా కుటుంబంతో గడపడానికి సమయం కేటాయించలేకపోతున్నట్లు ఆయన పరోక్షంగా తెలిపారు.
Also Read: World Cup 2025: ఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్, సౌతాఫ్రికా.. మహిళల క్రికెట్ కు కొత్త ఛాంపియన్స్
భవిష్యత్తులో ఐపీఎల్ వంటి ప్రముఖ ఫ్రాంచైజీ లీగ్స్‌లో ఎక్కువ కాలం ఆడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. విలియమ్సన్ 93 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 2,575 పరుగులు చేశారు. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన వారిలో ఆయన రెండవ స్థానంలో ఉన్నారు. ఆయన నాయకత్వంలోనే కివీస్ జట్టు 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్, ప్రశాంతమైన కెప్టెన్సీతో ఆయన ప్రపంచ క్రికెట్‌లో తనదైన ముద్ర వేశారు. కేన్ విలియమ్సన్ టీ20 క్రికెట్ వీడ్కోలుపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు స్పందిస్తూ, ఈ ఫార్మాట్‌లో ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.

