New York Fire Accident: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు కలలు అర్ధాంతరంగా కాలి బూడిదయ్యాయి. అలబామా రాష్ట్రంలోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం (Fire Accident) కారణంగా హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. తెలుగు కమ్యూనిటీలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
బర్మింగ్‌హామ్ అపార్ట్‌మెంట్‌లో ఉద్రిక్తత
అలబామా యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న సుమారు 13 మంది తెలుగు విద్యార్థులు బర్మింగ్‌హామ్‌లోని ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఈ అపార్ట్‌మెంట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ఇది కూడా చదవండి: Diet Soft Drinks: జీరో షుగర్ లేదా డైట్ సోడా.. ఏది ఆరోగ్యకరమైనది?
మంటలు వేగంగా వ్యాపించడంతో పాటు, దట్టమైన పొగ కాంప్లెక్స్‌ను చుట్టుముట్టింది. దీంతో అపార్ట్‌మెంట్‌లోని విద్యార్థులు శ్వాస ఆడక తీవ్రంగా అల్లాడిపోయారు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, లోపల చిక్కుకున్న విద్యార్థులందరినీ బయటకు తీసుకువచ్చారు.
మృతులు హైదరాబాద్, కూకట్‌పల్లి వాసులే
రెస్క్యూ ఆపరేషన్‌లో మొత్తం 13 మందిని బయటకు తీసుకురాగా, వీరిలో ఇద్దరు తెలుగు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, విధి వక్రీకరించి… చికిత్స పొందుతూ ఆ ఇద్దరు యువకులు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.
మృతులు:
- ఉడుముల సహజ రెడ్డి (హైదరాబాద్‌కు చెందినవారు)
- కూకట్‌పల్లికి చెందిన మరో విద్యార్థి (పేరు ఇంకా తెలియాల్సి ఉంది)
ఈ ఘటన భారతీయ విద్యార్థులను, ముఖ్యంగా తెలుగు కమ్యూనిటీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ పిల్లలు ఇలాంటి దుర్ఘటనకు గురికావడంపై మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారి మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

