Peddi

Peddi: ‘పెద్ది’ రిలీజ్ డేట్ పై న్యూ అప్డేట్!

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ గురించి అందరికీ తెలిసిందే. అనౌన్స్‌మెంట్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వరకు ఈ సినిమా సాలిడ్ హైప్ క్రియేట్ చేసింది. అయితే, ఈ సినిమా రిలీజ్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మొదట ఈ ఏడాది రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్ చేసినా, ఓటీటీ డీల్స్ కారణంగా వచ్చే ఏడాదికి షిఫ్ట్ అయినట్లు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే, ‘పెద్ది’ కోసం రెండు రిలీజ్ డేట్స్ గుసగుసలు వినిపిస్తున్నాయి. మార్చి 20 లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

Also Read: Good Bad Ugly: దుమ్ముదులుపుతున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ట్రైలర్!

Peddi: రేపు రానున్న గ్లింప్స్‌లో రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందట. ఈ అవైటెడ్ స్పోర్ట్స్ డ్రామా ఎప్పుడు వస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, వృద్ధి సినిమాస్ నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. మరి, ఈ భారీ ప్రాజెక్ట్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి!

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *