Traffic Challan Rule: ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై మరింత కఠినంగా వ్యవహరించడం ప్రారంభించింది. ఇకపై రాష్ట్రంలో వాహన యజమానులు తమ చలాన్‌లను ఒక నెలలోపు చెల్లించాల్సిందే. లేని పక్షంలో, పెండింగ్ చలాన్ మొత్తంపై అదనపు జరిమానా విధించనున్నారు.
రవాణా శాఖ కమిషనర్ బ్రజేష్ నారాయణ్ సింగ్ ప్రకారం, ఆగస్టు 10 నుండి కొత్త చలాన్ రికవరీ విధానం అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో ఆలస్య రుసుము చలాన్ మొత్తంలో 5% నుండి 10% వరకు ఉండనుంది. ఉదాహరణకు, రూ. 1,000 చలాన్ ఉంటే, ఒక నెలలో చెల్లించకపోతే రూ. 50 నుండి రూ. 100 అదనంగా కట్టాల్సి వస్తుంది.
వాహన యజమానులకు నేరుగా SMSలు, వాట్సాప్ నోటీసులు
వాహన యజమానులకు పెండింగ్ చలాన్‌లపై నేరుగా సమాచారం అందించేందుకు రవాణా శాఖ కొత్త సాంకేతిక విధానం తీసుకొచ్చింది.
-
వాహన యజమానులకు SMSలు, వాట్సాప్ నోటీసులు (చాట్‌బాట్ – 8005441222) పంపనున్నారు.
-
మొదటి దశలో జనవరి 2024 నుండి జూలై 2025 వరకు ఉన్న చలాన్‌ల సమాచారం ఇవ్వనున్నారు.
-
రెండవ దశలో 2022, 2023 సంవత్సరాల పెండింగ్ చలాన్‌ల వివరాలు కూడా అందజేయనున్నారు.
-
వాహన యజమానులు ఈ చాట్‌బాట్ ద్వారా తమ చలాన్ వివరాలను చెక్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Vizianagaram: విజయనగరం జిల్లాలో నవ దంపతులు అనుమానాస్పద మృతి
ఈ-చలాన్ ద్వారా సులభమైన చెల్లింపు
చలాన్ చెల్లింపు ప్రక్రియను పౌరుల సౌలభ్యం కోసం పూర్తిగా డిజిటల్ చేశారు. ఇంట్లో నుంచే చెల్లించవచ్చు.
చెల్లింపు విధానం ఇలా ఉంటుంది:
-
echallan.parivahan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
-
‘Check Challan Status’పై క్లిక్ చేసి,
-
చలాన్ నంబర్
-
వాహన నంబర్
-
డ్రైవింగ్ లైసెన్స్ నంబర్
వంటి ఎంపికల ద్వారా వివరాలు ఇవ్వాలి.
-
-
పెండింగ్ చలాన్‌లు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
-
“Pay Now” పై క్లిక్ చేసి Net Banking, Debit/Credit Card లేదా UPI ద్వారా చెల్లించాలి.
-
చెల్లింపు విజయవంతమైన తర్వాత ఆన్‌లైన్ రసీదు లభిస్తుంది, దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జాగ్రత్తలు – వాహన యజమానులకు హెచ్చరిక
-
ఒక నెలలోపు చలాన్ చెల్లించకపోతే అదనపు జరిమానా తప్పదని అధికారులు స్పష్టం చేశారు.
-
ఈ కొత్త విధానం యుపీలో ప్రారంభమైనా, త్వరలోనే ఇతర రాష్ట్రాలలో కూడా అమలయ్యే అవకాశం ఉందని సమాచారం.
-
కాబట్టి వాహన యజమానులు తమ చలాన్‌లు సకాలంలో చెల్లించుకోవడం అత్యంత అవసరం.