Karnataka: కర్ణాటక ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను రూ. 200కి పరిమితం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ నియమం రాష్ట్రంలోని అన్ని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో, భాష లేదా స్క్రీన్ రకంతో సంబంధం లేకుండా అమలులోకి రానుంది. సామాన్య ప్రేక్షకులకు ఈ నిర్ణయం సినిమా చూడటాన్ని మరింత సరసమైనదిగా మార్చనుంది. అయితే, భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు ఈ ఆంక్షల వల్ల ఆదాయంపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Raviteja father: టాలీవుడ్‌లో మరో విషాదం: మాస్ మహారాజా రవితేజ తండ్రి కన్నుమూత
ఐమాక్స్, 3D, 4DX వంటి ప్రీమియం స్క్రీన్‌ల ధరలు కూడా ఈ కొత్త నియమం కిందకు రానుండడంతో, నిర్మాతలు లాభాలను సమతుల్యం చేసుకోవడం కష్టతరంగా మారింది. ఈ నిర్ణయం సినిమా పరిశ్రమలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? ప్రేక్షకులకు, నిర్మాతలకు దీని ప్రభావం ఏమిటి? అనేది మున్ముందు చూడాలి.