New Ration Cards: రాష్ట్రంలో కొత్తగా రేషన్‌కార్డులు పొందిన లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాలకు కూడా ఆరోగ్య శ్రీ పథకం వర్తింపజేయాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కొత్తగా 30 లక్షల మంది లబ్ధిదారుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు.
New Ration Cards: ఈ మేరకు కొత్త రేషన్‌కార్డు లబ్ధిదారుల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డు అనుసంధాన ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. దీంతో ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల సంఖ్య 3.14 కోట్లకు చేరనున్నది. ఇక నుంచి కొత్త రేషన్‌కార్డుదారులు కూడా ఆరోగ్య శ్రీ పథకం ద్వారా వైద్య సదుపాయాలు పొందవచ్చన్నమాట.

