New Liquor Policy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్ జరీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ మద్యం దుకాణాల విధానానికి స్వస్తి పలుకుతూ కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం.
New Liquor Policy: కొత్తపాలసీ ప్రకారం దుకాణాల కోసం ఈరోజు నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఈనెల 11న రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహిస్తారు. దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునే వారు 2 లక్షల రూపాయల దరఖాస్తు రుసుము చెల్లించాలి. జనాభా ప్రాతిపదికన రూ.50 లక్షల నుంచి 85 లక్షల వరకు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు. ఈ నెల 12 నుంచి ప్రయివేట్ మద్యం దుకాణాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.
పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడొచ్చు :