Nepal: నేపాల్ కొత్త ప్రభుత్వం అవినీతి మరియు నిర్లక్ష్యంపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగానే మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్ ఇంకా మాజీ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీలు అరెస్ట్ కావడం గమనార్హం . ‘జెన్-జీ’ ఆందోళనల సమయంలో జరిగిన హింసను అరికట్టడంలో అప్పటి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దర్యాప్తు కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది.
హోం మంత్రిగా ఉండి కూడా భద్రతా సంస్థల మధ్య సమన్వయం చేయలేకపోయారని, హింసను ఆపడానికి ‘సీజ్ ఫైర్’ ఆదేశాలు ఇవ్వడంలో ఆలస్యం చేశారని లేఖక్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలను సమయానికి ‘రైట్ జోన్స్’ (Riot Zones) గా ప్రకటించకపోవడం వల్ల దేశవ్యాప్తంగా విధ్వంసం జరిగిందని కమిషన్ అభిప్రాయపడింది.
దర్యాప్తు సమయంలో లేఖక్ మాట్లాడుతూ.. తాను కేవలం పాలసీ నిర్ణయాలు మాత్రమే తీసుకుంటానని, క్షేత్రస్థాయిలో కాల్పుల నిర్ణయం పోలీసులు తీసుకుంటారని చెప్పారు. ఆందోళనల్లో బయటి వ్యక్తులు చొరబడటం వల్లే హింస చెలరేగిందని ఆయన వాదించారు. ప్రస్తుతం బాలెన్ షా ప్రభుత్వం ఈ నివేదికను అమలు చేయాలని నిర్ణయించడంతో ఈ అరెస్ట్ అనివార్యమైంది.
