Nepal: నేపాల్‌లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలతో అక్కడ రాజకీయ కలకలం రేగింది. దేశ హోంమంత్రి రమేష్ లేఖక్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను నేపాల్ ప్రధానమంత్రికి పంపించారు.
తెలుసుకున్న వివరాల ప్రకారం, ఖాట్మాండ్‌లో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో భారీ ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటివరకు ఈ అల్లర్లలో 19 మంది ప్రాణాలు కోల్పోగా, 250 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.
ఈ నేపథ్యంలో తనపై నైతిక బాధ్యత ఉందని పేర్కొంటూ హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు. ప్రస్తుతం నేపాల్‌లో చట్టవ్యవస్థను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.